తెలంగాణ

telangana

ETV Bharat / international

అంకుర సంస్థలకు ఫేస్​బుక్​ ఊతం..

స్టార్టప్​లు నెలకొలిపే వారి కోసం ఫేస్​బుక్​ ఓ సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. "ఫేస్​బుక్ హబ్స్"​ని ఆవిష్కరించింది. దీని కోసం దేశవ్యాప్తంగా 20 ప్రదేశాలను ఎంపిక చేసుకుంది.

ఫేస్​బుక్​ హబ్స్

By

Published : Mar 13, 2019, 6:01 AM IST

మీరు కొత్తగా అంకుర సంస్థ​ మొదలు పెడుతున్నారా... మీకు అంతగా అవగాహన లేదా... సమగ్ర సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా! అయితే ఇది మీకోసమే.

అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ఫేస్​​బుక్ నూతన వేదికకు శ్రీకారం చుట్టింది. కొత్తగా వ్యాపార రంగంలో అడుగుపెట్టే యువపారిశ్రామిక వేత్తల కోసం "ఫేస్​బుక్ హబ్స్"​ని ఆవిష్కరించింది.

అంకుర సంస్థలు(స్టార్టప్​) నెలకొల్పే ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిందే "ఫేస్​బుక్​ హబ్స్". ఇందులో భాగంగా యువ వ్యాపారవేత్తలకు శిక్షణ, వర్క్​షాపుల నిర్వహణ, వారి అనుమానాలను నివృత్తి చేస్తారు. దీనికోసం దేశవ్యాప్తంగా 20 ప్రదేశాలను ఎంపిక చేశారు.

దిల్లీ, గురుగ్రామ్, నోయిడా, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, పూణె, నవీ ముంబయి, గోవాలలో ఫేస్​బుక్​హబ్​ లను నిర్వహిస్తారు. ఏడాది పాటు జరిగే ఈ కార్యక్రమంలో "91 స్ప్రింగ్​బోర్డ్" సంస్థ సాయంతో శిక్షణనిస్తారు. సంస్థలను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలి, నిర్మాణాత్మక పనితీరు, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాలపై తర్ఫీదునిస్తారు.

"ఇప్పటికే మేము వందలాది స్టార్టప్​లను ప్రోత్సహిస్తున్నాం. 91 స్ప్రింగ్​బోర్డుతో కలిసి వాటికి మరింత ఊతమిస్తాం. భారత వ్యాపార రంగంలో వీటిని ముందుకు తీసుకెళ్తాం"
-- సత్యజీత్ సింగ్, ఫేస్​బుక్ ఇండియా ప్రతినిధి

ఫేస్​బుక్ హబ్స్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంకురాల పనితీరుని పర్యవేక్షిస్తాయి. వ్యాపార వేత్తలకు శిక్షణనిచ్చి వారికి మద్దతుగా నిలుస్తాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details