ఆస్ట్రేలియాలో న్యూస్ షేరింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ప్రకటించింది. పబ్లిషింగ్ చేసే వారికి సామాజిక మాధ్యమాలు డబ్బులిచ్చి వార్తలు పొందాలనిఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఫేస్బుక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
"ఫేస్‌బుక్‌కు, పబ్లిషర్లకు మధ్య సన్నిహిత్యాన్ని గుర్తించలేక ఈ చట్టం ప్రవేశపెట్టారు. ఫేస్బుక్.. న్యూస్ కంటెంట్‌ను దొంగిలించదు. పబ్లిషర్లే తమ కథనాలను ఫేస్బుక్లో షేర్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు," అని ఫేస్బుక్ ఉపాధ్యక్షుడు కాంప్ బెల్ బ్రౌన్ తన వ్యక్తిగత బ్లాగ్‌లో పేర్కొన్నారు.