మయన్మార్ హింసాత్మక ఘటనలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో సైన్యం అధికారాన్ని చేజిక్కుంచుకున్న తరుణంలో.. ఆ విభాగానికి చెందిన మొత్తం ఖాతాలతో సహా వారి అనుబంధంలోని అన్ని కంపెనీల ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. హింసాత్మక విధానాలతో తమ సంస్థ నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది ఫేస్బుక్.
సైనిక తిరుగుబాటు తర్వాత ఇప్పటికే ప్రముఖ మయవాడి టీవీ, టెలివిజన్ బ్రాడ్కాస్టర్ ఎంఆర్టీవీ సహా.. సైన్యానికి అనుసంధానమైన పలు ఖాతాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా ఫేస్బుక్ యాజమాన్యంలో ఉన్న 'ఇన్స్టాగ్రామ్'లోనూ ఈ నిషేధాజ్ఞలు వర్తింపజేసింది.