ఎఫ్-16 యుద్ధ విమానంపై పాక్ బుకాయింపు మానలేదు. తమ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం కూల్చివేసిందన్న వార్తలను మరోసారి కొట్టి పారేసింది. ఎఫ్-16 విమానంపై భారత ప్రభుత్వం ఏ ఆధారాలు చూపడం లేదని ఆరోపించింది.
భారత వైమానిక దళం 'మిగ్-21 బైసన్'తో పాక్ 'ఎఫ్-16' విమానాన్ని కూల్చిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటనను పాక్ ఖండించింది. పుల్వామా ఉగ్రదాడిలో పాక్ హస్తముందన్న భారత్ వాదనలనూ తోసిపుచ్చింది.