అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ మారోమారు పేలుళ్లతో దద్దరిల్లింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మరో భారీ ఉగ్రకుట్రను అమెరికా సైన్యం అడ్డుకోగలిగింది! కాబుల్ విమానాశ్రయంవైపు దూసుకెళుతున్న ఐసిస్‌కు చెందిన ఓ వాహనాన్ని వైమానిక దాడులతో ధ్వంసం చేసింది అగ్రరాజ్యం. ఈ నేపథ్యంలో రెండో పేలుడుకు సంబంధించి శబ్దాలు వినిపించాయి. దీంతో ఆ వాహనంలో భారీ మొత్తంలో బాంబులున్నాయన్నది రుజువైందని అగ్రరాజ్యం పేర్కొంది.
"కాబుల్‌లోని ఓ వాహనంపై అమెరికా భద్రతా దళం.. ఆదివారం సెల్ఫ్ డిఫెన్స్ అన్మాన్డ్ ఓవర్ ది హారిజాన్ వైమానిక దాడులను జరిపింది. కాబుల్ విమానాశ్రయానికి పొంచి ఉన్న ఉగ్రముప్పును తొలగించేందుకే ఈ చర్యలు చేపట్టింది. లక్ష్యాన్ని ఛేదించినట్టు మాకు నమ్మకం ఉంది. అదే సమయంలో ఆ వాహనం నుంచి భారీ పేలుడు శబ్దాలు బయటకు వచ్చాయి. దీంతో ఆ వాహనంలో విస్ఫోటకాలు ఉన్నట్టు స్పష్టమైంది. ఈ పూర్తివ్యవహారంలో పౌరులకు ఏమైనా అయ్యిందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నాము. ఇప్పటివరకు అలాంటి సమాచారం ఏదీ మాకు అందలేదు."