తెలంగాణ

telangana

ETV Bharat / international

Taliban Afghanistan: అంతా నాశనమైంది.. అఫ్గాన్​ ఎంపీ కంటతడి - TALIBAN NEWS

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల(Taliban Afghanistan) చెర నుంచి భారత్​ చేరుకున్న అక్కడి ఎంపీ నరేందర్​ సింగ్​ ఖల్సా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాలిబన్లు.. అఫ్గాన్​లో ఎంపీలను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్లలో సాధించుకున్నదంతా.. నాశనం అయిపోయిందని కన్నీరు పెట్టారు.

Taliban Afghan
అఫ్గాన్​ ఎంపీ కంటతడి

By

Published : Aug 22, 2021, 1:21 PM IST

Updated : Aug 22, 2021, 2:27 PM IST

అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​ చేరుకున్న అక్కడి ఎంపీ నరేందర్​ సింగ్​ ఖల్సా(Narender Singh Khalsa) కంటతడి పెట్టారు. 20 సంవత్సరాలుగా తాము నిర్మించుకున్నదంతా.. నాశనం అయిపోయిందంటూ ఆవేదన చెందారు. దిల్లీలో విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే.. ఆయన పలుమార్లు కన్నీరు కార్చారు.

కంటతడి పెట్టిన అఫ్గాన్​ ఎంపీ

''నాకు ఇప్పుడు ఏడుపొస్తుంది. 20 ఏళ్లలో మేం సాధించిందంతా.. ఇప్పుడు నాశనం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది శూన్యం. ఇంకేం లేదు.''

- నరేందర్​ సింగ్​ ఖల్సా, అఫ్గానిస్థాన్​ ఎంపీ.

కాబుల్​ విమానాశ్రయం నుంచి భారతీయులతో స్వదేశానికి వచ్చిన సీ-17 యుద్ధవిమానంలో.. 23 మంది అఫ్గాన్​ సిక్కులు కూడా ఉన్నారు. ఇందులోనే భారత్​కు చేరుకున్నారు ఖల్సా. తాలిబన్లు ఆక్రమించుకున్న అఫ్గానిస్థాన్​లో (Taliban Afghanistan) ఇంకా.. 200 మందికిపైగా హిందూ సిక్కులు చిక్కుకున్నారని పేర్కొన్నారు.

తనను, తన కుటుంబాన్ని రక్షించినందుకు భారత్​కు కృతజ్ఞతలు చెప్పారు. అఫ్గాన్​ వీడటం బాధగా ఉన్నా.. ఇండియా తమకు రెండో మాతృదేశం లాంటిదని తెలిపారు.

తాలిబన్లు అక్కడ.. ఎంపీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఖల్సా చెప్పారు. ఇళ్లలో తనిఖీలు చేయడం సహా.. ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు.

ఇదీ చూడండి: Afghan news: తాలిబన్​ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి..

Last Updated : Aug 22, 2021, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details