ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ సందర్భంగా యూరప్‌లోని ప్రధాన నగరాలన్నీ శనివారం కవాతులతో కిక్కిరిసిపోయాయి. అయితే స్పెయిన్ రాజధాని నగరం మాడ్రిడ్‌లో జరిగిన పరేడ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వందలాది మంది 'గే' లు తమ హక్కల కోసం గళమెత్తుతూ ప్రదర్శన నిర్వహించారు.
ప్రైడ్ పరేడ్‌లో గేలు, రాజకీయ నేతల ఫైట్
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిటిజెన్స్ పార్టీ నేతలకు, ఎల్జీబీటీ ఉద్యమకారులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
ఎల్బీజీటీ పరేడ్‌కు వ్యతిరేకంగా సిటిజెన్స్ పార్టీ నేతలు కవాతు చేపట్టారు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎల్జీబీటీ ఉద్యమకారులు. మార్గ మధ్యంలోనే వారి కవాతును అడ్డుకున్నారు. రాజకీయ నేతలపైకి ఖాళీ సీసాలు విసురుతూ తమ నిరసన తెలియజేశారు. వచ్చే ఏడాది ప్రైడ్ పరేడ్‌ను నగరం బయట నిర్వహిస్తామని మేయర్ అనడంపైనా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు ట్రాన్స్జెండర్లు. ఫలితంగా అక్కడ ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ వేలాది మంది ఈ పరేడ్‌లో పాల్గొన్నారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో ఎల్జీబీటీ హక్కుల సాధనకు తలపెట్టిన ఉద్యమం 50వ వార్షికోత్సం సందర్భంగా శనివారం పరేడ్ నిర్విహించారు. భారత్ నుంచి ఐరోపా వరకు వివిధ దేశాల్లో కవాతు చేపట్టారు.