ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న వేళ భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు జరిగితే యూరేషియాలో ప్రాంతీయ అస్థిరత మరింతగా పెరుగుతుందని రష్యా పేర్కొంది. వీటిని ఆసరాగా తీసుకుని భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర ప్రాంతీయ శక్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆసియాలోని రెండు పెద్ద దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలో సహజంగానే ఆందోళన పడుతున్నామని రష్యా తెలిపింది. విభేదాల విషయంలో రెండు దేశాలు నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు రష్యా మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్ బాబష్కిన్. బ్రిక్స్, ఎస్సీఓలో సభ్యదేశాలపై భారత్, చైనా.. బహుళపాక్షిక విధానంలో సహకారాన్ని పెంచుకోవాలని సూచించారు.