తెలంగాణ

telangana

ETV Bharat / international

లంకలో అత్యయిక స్థితి- దాడుల వెనుక ఎన్​టీజే!

శ్రీలంకలో నేటి అర్ధరాత్రి నుంచి అత్యవసర పరిస్థితి అమలు కానుంది. ఆదివారం వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దాడుల్లో ఏడుగురు అత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారని శ్రీలంక మంత్రి సేనరత్నే ప్రకటించారు. వారంతా తమ దేశపౌరులేనన్నారు. దాడులకు పాల్పడింది నేషనల్​ తవ్​హీద్​ జమాత్​ సంస్థ అని వెల్లడించారు.

లంకలో అత్యవసర పరిస్థితి- దాడుల వెనుక ఎన్​టీజే!

By

Published : Apr 22, 2019, 4:26 PM IST

శ్రీలంకలో నేటి అర్ధరాత్రి నుంచి అత్యవసర పరిస్థితి అమలు కానుంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దాడుల వెనుక ఆ సంస్థే

దేశంలో జరిగిన ఎనిమిది బాంబు పేలుళ్ల దాడులకు పాల్పడింది ఇస్లాం అతివాద నేషనల్​ తవ్​హీద్​ జమాత్(ఎన్​టీజే)​ సంస్థేనని వెల్లడించారు శ్రీలంక మంత్రి రజిత సేనరత్నే. ఈ దాడులకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు.

అత్మాహుతి సభ్యులు లంకేయులే

ఎనిమిది బాంబు దాడుల్లో మొత్తం ఏడుగురు అత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారని సేనరత్నే ప్రకటించారు. వారంత తమ దేశపౌరులేనని తెలిపారు.

ముందే హెచ్చరికలు

దాడులు జరిగే అవకాశం ఉందని జాతీయ నిఘా విభాగాధిపతి.... పోలీసు ఇన్స్​పెక్టర్​ జనరల్​(ఐజీపీ)ను ముందుగానే హెచ్చరించారని తెలిపారు సేనరత్నే.
" ఈ నెల​ 4న అంతర్జాతీయ నిఘా విభాగం దాడుల గురించి హెచ్చరికలు జారీ చేసింది. జాతీయ నిఘా విబాగం ఐజీపీకి ఈ నెల 9న సమాచారం అందించింది."

-- శ్రీలంక మంత్రి రజిత సేనరత్నే.

భద్రత కల్పించడంలో విఫలమైనందుకు గాను రాజీనామా చేయాలని ఐజీపీ పూజిత్​ జయసుందరేను సేనరత్నే ఆదేశించారు.

తెలిసినా ఏం చేయలేదు

దాడులు జరుగుతాయనే సమాచారమున్నా ప్రభుత్వం సరైన నివారణ చర్యలు చేపట్టలేకపోయిందని విమర్శించారు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్​ నేత , మంత్రి రవూఫ్​ హకీమ్​.

ABOUT THE AUTHOR

...view details