తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇండోనేషియా ఎన్నికలు- విడోడో వర్సెస్ ప్రబోవో - ఎన్నికలు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ఇండోనేషియాలో జరుగుతున్నాయి. 193 మిలియన్​ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్​ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. మే నెలలో అధికారిక ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.

ఇండోనేషియా ఎన్నికలు- విడోడో వర్సెస్ ప్రబోవో

By

Published : Apr 17, 2019, 11:03 AM IST

ఇండోనేషియా ఎన్నికలు- విడోడో వర్సెస్ ప్రబోవో

భూకంపాలు, సునామీలతో వార్తల్లో నిలిచే ఇండోనేషియాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అధ్యక్ష ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలకు పోలింగ్​ కొనసాగుతోంది. మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 193 మిలియన్​ మంది ఇండోనేషియావాసులు 8 లక్షల పోలింగ్​ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో 2 లక్షల 45 వేల మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

పోటాపోటీ...

అధ్యక్షుడు జోకో విడోడోతో మాజీ జనరల్​ ప్రబోవో సుబియాంటో అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ తప్పదని ముందస్తు సర్వేలు అంచనా వేశాయి.

ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రాథమిక ఫలితాలు(క్విక్​ కౌంట్స్​) వెలువడతాయి. అధికారిక ఫలితాలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: ఇంటిపై విమానం కూలి ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details