భారత్-చైనా మధ్య 8వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ వారంలో జరగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణే లక్ష్యంగా ఇరు దేశాలు చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.
రెండు దేశాలకు ఈ దఫా చర్చలు అత్యంత ముఖ్యమైనవి. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలతో పాటు ఉద్రిక్తతలు నెలకొన్న ఇతర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముండటమే ఇందుకు కారణం.
"ఈ వారంలోనే 8వ విడత చర్చలు జరగనున్నాయి. అందుకోసం భారత్-చైనా దేశాలు సిద్ధమవుతున్నాయి."