తెలంగాణ

telangana

ETV Bharat / international

'కోకోనట్​ వైన్'​ కలకలం- 8 మంది మృతి

ఫిలిప్పీన్స్​లోని మనీలాలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా లభించే కోకోనట్​ వైన్​ తాగి 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యంలో మిథనాల్​ శాతం ఎక్కువగా ఉండటమే ఈ ఘటనకు కారణమని అధికారులు స్పష్టం చేశారు.

Eight die in Philippines after drinking coconut wine
'కోకోనట్​ వైన్'​ కలకలం- 8 మంది మృతి

By

Published : Dec 23, 2019, 12:37 PM IST

'కోకోనట్​ వైన్'​ కలకలం- 8 మంది మృతి

ఫిలిప్పీన్స్​లోని మనీలాలో కోకోనట్​ వైన్​ ఘటన కలకలం రేపింది. మద్యం సేవించి 8మంది ప్రాణాలు కోల్పోగా... మొత్తం 300మంది ఆసుపత్రి పాలయ్యారు. కోకోనట్​ వైన్​లో మిథనాల్​ అధికంగా ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

వారాంతపు సమావేశంలో...

బాధితులందరూ రిజాల్​ పట్టణంలోని ఓ వారాంతపు సమావేశానికి వెళ్లి ఆ కోకోనట్​ వైన్​ను సేవించారు. అనంతరం తీవ్ర కడుపు నొప్పితో సతమతమయ్యారు. 9మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. రోగులకు చికిత్స అందించడానికి సెలవుల్లో ఉన్న వైద్యులను కూడా హాస్పిటల్​కు తిరిగి రప్పించినట్టు ఫిలిప్పీన్స్​ సాధారణ ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది.

అధికారుల చర్యలు...

కోకోనట్​ వైన్​ను 'లంబనాగ్​' అని కూడా అంటారు. దీనిని స్థానికంగా తయారు చేస్తారు. ఇప్పటికే దీని అక్రమ తయారీపై ఆ ప్రాంతంలో ఆంక్షలున్నాయి. మిథనాల్​ ఎక్కువైతే.. కంటి చూపు పోవడం లేదా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానిక ప్రభుత్వం ఈ కోకోనట్​ వైన్​ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి:- ఖైదీల మధ్య ఘర్షణ.. మరో 18 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details