ఉత్తర ఫిలిప్పీన్స్లోని లుజోన్ స్ట్రెయిట్ దీవులను శనివారం వరుస భూకంపాలు కుదిపేశాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 5.4, 5.9గా నమోదైంది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందారు. 60 మందికిపైగా గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. తక్షణమే అప్రమత్తమైన అధికారులు... సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తర ఫిలిప్పీన్స్లో వరుస భూకంపాలు - మృతి
వరుస భూకంపాలతో ఫిలిప్పీన్స్ ఉలిక్కిపడింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 5.4, 5.9, 5.7గా నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తర ఫిలిప్పీన్స్లో వరుస భూకంపాలు
ఈ సమయంలోనే మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత 5.7గా నమోదైనట్టు వెల్లడించారు అధికారులు. వరుస భూకంప ఘటనలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇదీ చూడండి:- కర్ణాటకం: ప్రమాణం పూర్తి... మరి తర్వాతేంటీ?