తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో అర్ధరాత్రి భూకంపం- ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. - China Earthquake latest news

Earthquake In Western China: శనివారం అర్ధరాత్రి దక్షిణ చైనాను భారీ భూకంపం వణికించింది. భూకంపం కారణంగా ఇళ్లు, భవనాలు ఊగిపోవడం సీసీటీవీల్లో రికార్డయింది. రిక్టార్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6.9 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

earthquake in western china
చైనాలో అర్ధరాత్రి భూకంపం

By

Published : Jan 8, 2022, 6:26 PM IST

చైనాను వణికించిన భూకంపం

Earthquake In Western China: దక్షిణ చైనాలోని కింగాయ్​ రాష్ట్రంలో శనివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం కారణంగా మెన్​యువాన్​ హుయి ప్రాంతంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు ఊగిపోయాయి.

దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని సామాగ్రి, సీలింగ్ ల్యాంప్స్ ధ్వంసమయ్యాయి. భూకంపం కారణంగా జంతువులు సైతం లేచి పరుగులు పెట్టాయి. భూమి కంపించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదయ్యాయి.

జిన్​జియాంగ్ ప్రాంతంలో భూకంపం కారణంగా.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కింగాయ్- టిబెట్ మధ్య రైలు ప్రయాణాలను రద్దు చేశారు అధికారులు.

భూకంపం దృష్ట్యా.. సహాయక చర్యల కోసం 500 మంది వేర్వేరు బృందాలను మోహరించారు అధికారులు.

ఇదీ చూడండి:మంచువర్షం.. కార్లలోనే ఇరుక్కుపోయి 16 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details