తెలంగాణ

telangana

ETV Bharat / international

'చైనా ఏకపక్ష చర్యలను భారత్ అంగీకరించదు' - భారత్ చైనా సరిహద్దు

భారత్​- చైనా సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేస్తున్న ఏకపక్ష చర్యలను భారత్​ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని విదేశాంగ మంత్రి ఎస్​. జై శంకర్​ స్పష్టం చేశారు. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్​(ఎస్​సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో చర్చలు జరిపారు.

China
చైనా

By

Published : Jul 15, 2021, 5:19 AM IST

తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణలో నెలకొన్న జాప్యం, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ చైనాను గట్టిగా హెచ్చరించారు. తజికిస్థాన్​ రాజధాని దుషన్‌బేలో జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ వాంగ్‌ యీతో జైశంకర్‌ చర్చలు జరిపారు. ప్యాంగ్యాంగ్‌ సరస్సు నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేలా కనిపించాయన్న జైశంకర్​.. ఆ తర్వాత నుంచి బలగాలను వెనక్కి రప్పించే ఎలాంటి చర్యలను డ్రాగన్‌ చేపట్టలేదని గుర్తుచేశారు.

వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్న జైశంకర్ తూర్పు లద్దాఖ్‌లో శాంతి, సుస్థిరతను పునరుద్ధరించిన తర్వాతే భారత్‌తో చైనా సంబంధాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మరోమారు ఆర్మీ ఉన్నాతాధికారుల భేటీని నిర్వహించాలని ఇరుదేశాల విదేశాంగ మంత్రులు అంగీకరానికి వచ్చారు.

తదుపరి జరగబోయే సైన్యాధికారుల చర్చల్లో ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details