దుబాయ్‌లో 'పామ్ ఫౌంటెయిన్' పేరుతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్ అక్టోబర్ 22న ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో, పర్యటక ప్రాంతంగా దుబాయ్ మరింత మందిని ఆకర్షించనుందని దుబాయ్ ఫెస్టివల్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ సీఈఓ అహ్మద్ అల్ ఖాజా అన్నారు.
3 వేల ఎల్ఈడీ లైట్లతో
దుబాయ్‌లోని పామ్జుమేరియా దీవుల్లోని పాయింటే వద్ద నిర్మించిన ఈ ఫౌంటెయిన్.. సముద్ర జలాల్లో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 3 వేల ఎల్ఈడీ లైట్ల వెలుగులో 105 మీటర్లు ఎగసిపడే 'పామ్ ఫౌంటెయిన్' నీరు పర్యటకులను మరింత ఆకర్షించనుంది.