ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్గా దుబాయ్‌లోని పామ్ ఫౌంటెయిన్ నిలిచింది. అక్టోబర్ 22న ప్రారంభమైన.. ఈ ఫౌంటెయిన్ ఇప్పుడు గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్‌కు గిన్నిస్ రికార్డు ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పర్యటకులు భారీగా తరలివచ్చారు. బాణసంచాలు, విద్యుద్దీపాల వెలుగుల్లో ఫౌంటెయిన్ చూపరులను కనువిందు చేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్ దుబాయ్‌లోని పామ్జుమేరియా దీవుల వద్ద నిర్మించిన ఈ ఫౌంటెయిన్.. సముద్ర జలాల్లో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. గత రికార్డు 11 ఏళ్ల పాటు కొనసాగిందని.. ఇప్పుడది చెరిగిపోయిందని నిర్వాహకులు తెలిపారు.
బాణసంచా వెలుగుల్లో ఫౌంటెయిన్ ఇవీ ప్రత్యేకతలు..
- 3 వేల ఎల్ఈడీ లైట్ల వెలుగులో 105 మీటర్లు ఎగసిపడే 'పామ్ ఫౌంటెయిన్' నీరు పర్యటకులను కట్టిపడేస్తోంది.
- సాయంత్రం 7 నుంచి రాత్రి 12 గంటల మధ్య సమయంలో 20 బెస్పోక్ షోలతో పాటు, 5 విభిన్న ప్రదర్శనలు జరుగుతాయి.
- సంగీతంతో ప్రదర్శించనున్న ఈ 'షో'లు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి.
- ప్రతి అరగంటకు ఒకసారి.. 3 నిమిషాల పాటు సాగే ప్రదర్శనలు