తెలంగాణ

telangana

ETV Bharat / international

డ్రగ్స్ బానిసలకు తాలిబన్ల​ 'ట్రీట్​మెంట్​'- తిండి పెట్టకుండా... - డ్రగ్స్​ అఫ్గానిస్థాన్​

అఫ్గానిస్థాన్​ కాబుల్​లో డ్రగ్స్​ బానిసల పరిస్థితి దయనీయంగా ఉంది(taliban news). వీరిపై తాలిబన్లు ప్రత్యేక దృష్టిపెట్టారు. దొరికిన వారిని దొరికినట్టు డ్రగ్స్​ ట్రీట్​మెంట్​ సెంటర్లకు తరలిస్తున్నారు(afghanistan news). వారితో నగ్నంగా స్నానం చేయించి, గుండు కొట్టిస్తున్నారు. భోజనం పెట్టడం లేదు. ఎందుకు? అని అడిగితే.. చికిత్సలో భాగం అని జవాబు చెబుతున్నారు.

drug-users-live-in-fear-in-kabul
'మత్తు'బాబులకు తాలిబన్ల స్పెషల్​ ట్రీట్​మెంట్​!

By

Published : Oct 10, 2021, 5:35 PM IST

అఫ్గానిస్థాన్​ను(afghanistan news) తమ గుప్పిట్లో తీసుకున్న తాలిబన్లు.. ఇప్పుడు డ్రగ్స్​కు అలవాటుపడినవారిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కాబుల్​ వీధుల్లో మత్తు​ బానిసలను పట్టుకుని బలవంతంగా డ్రగ్​ ట్రీట్​మెంట్​ సెంటర్లకు తరలిస్తున్నారు(taliban news).

వంతెనల కింద చేరి డ్రగ్స్​ సేవిస్తూ...
కాబుల్​లోని ఓ వంతెన కింద డ్రగ్స్​ సేవిస్తూ...

కాబుల్​లో డ్రగ్స్​ తీసుకునే వారి సంఖ్య కాస్త ఎక్కువే! ఇందులో పేదలే ఎక్కువగా ఉంటారు. వీరందరూ హెరాయిన్​ వంటి డ్రగ్స్​ సేవించి.. చెత్తకుప్పల పక్కన, వంతనెల కింద, మురుగు నీటి దగ్గర పడి ఉంటారు. ఇలాంటి వారిపై తాలిబన్ల కన్నుపడింది. వీళ్లని చికిత్సా కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత వ్యతిరేకత ఎదురైనా చంపేస్తున్నారు.

చికిత్సా కేంద్రంలో రోగులు..
డ్రగ్స్​ బానిసలు..

కాబుల్​లోని ఫీనిక్స్​ క్యాంప్​నకు వీరిని తరలిస్తున్నారు. 1000మందికిపైగా రోగులకు చికిత్స అందించే సామర్థ్యం దీనికి ఉంది. అక్కడ.. రోగులను బట్టులు తీయించి, నగ్నంగా స్నానం చేయిస్తున్నారు. గుండు కొట్టిస్తున్నారు. కొందరికి భోజనం కూడా పెట్టడం లేదు. ఎందుకు అని ప్రశ్నిస్తే.. 'ఇదీ చికిత్సలో భాగమే' అంటున్నారు అక్కడి వైద్యులు.

చికిత్సకు ముందు..
ఇదీ దుస్థితి..
నగ్నంగా గుండుకొట్టించి..
రోగికి చికిత్స అందిస్తున్న వైద్యుడు

ఇదీ చూడండి:-పోలీసులుగా మారిన తాలిబన్లు- వీధుల్లో తుపాకులతో పహారా

ABOUT THE AUTHOR

...view details