తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌదీ ఆరాంకో చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి

సౌదీ అరేబియాలో ఆరాంకో సంస్థ నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి జరిగింది. అయితే ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. గతంలో ఈ తరహా దాడులు చేసిన యెమెన్​కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By

Published : Sep 14, 2019, 2:10 PM IST

Updated : Sep 30, 2019, 2:01 PM IST

సౌదీ ఆరాంకో చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి

సౌదీ అరేబియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై శనివారం డ్రోన్​ దాడి జరిగింది. ఫలితంగా భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సౌదీ ఆరాంకో సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కర్మాగారంపై ఎవరు దాడికి పాల్పడ్డారో ఇప్పటి వరకు తెలియరాలేదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఘటనపై ఆరాంకో స్పందించలేదు.

"చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా డ్రోన్​లు దాడులు చేశాయి. ఫలితంగా చమురు క్షేత్రంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. "
- సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ

బుక్యాక్​, ఖురైస్​ చమురు క్షేత్రాల్లో జరిగిన దాడులకు ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. అయితే గతంలో ఈ తరహా డ్రోన్​ దాడులు చేసిన యెమెన్​కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

డ్రోన్ దాడిలో ఎవరైనా గాయపడ్డారా? లేదా చమురు ఉత్పత్తిపై ప్రభావం పడిందా? అనే విషయాలు స్పష్టంగా తెలియడం లేదు. అమెరికా - ఇరాన్ మధ్య అణు ఒప్పందం విషయమై ఏర్పడిన ఘర్షణ నేపథ్యంలో.. పర్షియన్ గల్ఫ్​లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి:ఈ-కామర్స్​ సంస్థల భారీ డిస్కౌంట్​​ ఆఫర్లను నిషేధిస్తారా?

Last Updated : Sep 30, 2019, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details