తెలంగాణ

telangana

ETV Bharat / international

అబుదాబి ఎయిర్​పోర్ట్​పై డ్రోన్​ దాడి.. భారతీయులు మృతి - పేలుడు

Drone attack: అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్​ దాడులు చేసింది హౌతీ తిరుగుబాటు సంస్థ. ఈ దాడులతో మూడు చమురు ట్యాంకులు పేలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు చెప్పారు.

Drone attack
విమానాశ్రయంపై డ్రోన్ల దాడి

By

Published : Jan 17, 2022, 4:01 PM IST

Updated : Jan 17, 2022, 4:53 PM IST

Drone attack: యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిపై యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ డ్రోన్‌ దాడులు చేయగా.. ముగ్గురు మరణించారు. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా దాడులు జరిపింది. ప్రధాన విమానాశ్రయంలో ఒక పేలుడు జరగ్గా.. మరో చోట మూడు చమురు ట్యాంకులు పేలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు డ్రోన్‌ దాడులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్థానీ మృతి చెందగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన పేలుడు చిన్నదేనని పోలీసులు చెప్పారు. విమానాశ్రయం విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగినట్లు వెల్లడించారు. ఇండస్ట్రీ మస్తఫా ప్రాంతంలో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన మూడు పెట్రోలియం ట్యాంకర్లపైనా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఎగిరే చిన్న వస్తువులు పడిన తర్వాత చమురు ట్యాంకులు పేలినట్లు పోలీసులు వివరించారు. దాడుల వల్ల పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు.

యూఏఈపై దాడులు చేసినట్లు హౌతీ సంస్థ కూడా ప్రకటించింది. యెమన్‌లో ఇరాన్‌ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులతో సౌదీ నేతృత్వంలో 2015 నుంచి యూఏఈ యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీతో పాటు యూఏఈని కూడా హౌతీ సంస్థ లక్ష్యంగా చేసుకుంది.

Last Updated : Jan 17, 2022, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details