తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2021, 12:49 PM IST

ETV Bharat / international

సిడ్నీలో వరద బీభత్సం- మరో రెండు రోజుల్లో తీవ్రం!

ఆస్ట్రేలియాలో భారీ వర్షాలకు సంభవించిన వరదలు సిడ్నీ సహా పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. సిడ్నీలో సుమారు 54 వేల మందిపై వరద ప్రభావం పడిందని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

aus floods
ఆస్ట్రేలియాలో వర్షాలకు పోటెత్తుతున్న వరదలు

ఆస్ట్రేలియాలో భారీ వరదలు

ఆస్ట్రేలియాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. న్యూ సౌత్‌వేల్స్‌లోని సిడ్నీ నగరం నీటమునిగింది. ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌లోకి పెద్దఎత్తున వరద నీరు చేరింది. నిత్యావసరాలు దొరకక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వందలాది మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు న్యూ సౌత్‌ వేల్స్ ప్రీమియర్ గ్లాడిస్ తెలిపారు.

సిడ్నీలో సుమారు 54 వేల మందిపై వరద ప్రభావం పడిందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న జంతువులను రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరదల ధాటికి జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. సిడ్నీ సహా పలు నగరాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని వ్యవసాయ మంత్రి డేవిడ్ లిటిల్‌ ప్రౌండ్‌ వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి :మోదీ పర్యటనకు ముప్పేమీ లేదు: బంగ్లాదేశ్​

ABOUT THE AUTHOR

...view details