తెలంగాణ

telangana

ETV Bharat / international

'నిర్మానుష్య ప్రదేశాల ద్వారా ఉగ్రవాదుల చొరబాటు' - నియంత్రణ రేఖ

దాదాపు 60మంది ఉగ్రవాదులు సరిహద్దు​లోని నిర్మానుష ప్రదేశాల నుంచి దేశంలోకి చొరబడినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాన్ని భారత్​ సైన్యం ఇంకా ధ్రువీకరించలేదు.

నిర్మానుష ప్రాంతాల ద్వారా భారీగా చొరబడిన ఉగ్రమూక

By

Published : Sep 17, 2019, 10:00 PM IST

Updated : Oct 1, 2019, 12:12 AM IST

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని తొలిగించిన​ నాటి నుంచి దాదాపు 60మంది ఉగ్రవాదులు.. నిర్మానుష ప్రదేశాల ద్వారాదేశంలోకి అక్రమంగా చొరబడినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు పాక్​ సైన్యం.. ఉగ్రవాదులకు సహాయం చేసినట్టు వెల్లడించారు.

ఉత్తర కశ్మీర్​, పూంచ్​, రాజౌరీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాటు ఘటనలు భారీగా పెరిగాయని నిఘా వ్యవస్థ సమాచారం అందించిన తరుణంలో.. అధికారులు ఈ విషయాన్ని వెల్లడించడం కలవరపరుస్తోంది. అయితే ఉగ్రవాదుల చొరబాటుపై భారత్​ సైన్యం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

చొరబాటు ఘటనలను నిర్ధారించేందుకు ఇటీవలే ఓ సమావేశం జరిగింది. గురెజ్​, మచిల్​, గుల్​మార్గ్​, పూంచ్​, రాజౌరీ ప్రాంతాల్లో జరిగిన చొరబాటు ఘటనలకు సంబంధించిన ఆధారాలను.. భేటీకి హాజరైన ఓ సైన్యాధికారికి వివిధ భద్రతా సంస్థలు అందించాయి.

నిర్మానుష ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల చొరబాటు జరిగిందన్న విషయంపై విచారణ జరపుతున్నట్టు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బగ్​ సింగ్​ తెలిపారు.

1990ల్లో కశ్మీర్​లోకి చొరబడేందుకు గుల్​మార్గ్​లోని ఎత్తైన ప్రాంతాలను వినియోగించేవారు ఉగ్రవాదులు. అనంతరం భారత్​ సైన్యం అక్కడ నిఘాను పెంచి ఉగ్రవాదుల చొరబాటును నియంత్రించింది. ఈ మార్గాన్నేతాజాగా చొరబాటుకు ఉగ్రవాదులు అనేక మార్లు ఉపయోగించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎదురుకాల్పుల ముసుగులో ముష్కరులు గురెజ్, మచిల్​, తంగ్​ధార్​ ప్రాంతాల్లోకి ప్రవేశించి ఉండవచ్చన్నారు. గండర్​బల్​ ప్రాంతంలో కనపడుతున్న కొత్త వారిని దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదుల చొరబాటు జరిగిందని అధికారులు విశ్వసిస్తున్నారు.​

Last Updated : Oct 1, 2019, 12:12 AM IST

ABOUT THE AUTHOR

...view details