ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో ఏ సమస్య వచ్చినా.. దేని గురించి తెలుసుకోవాలన్నా చాలా మంది ముందుగా ఆశ్రయించేది గూగుల్‌నే. అయితే సెర్చ్ ఇంజన్లో అన్ని రకాల సమాచారం దొరుకుంది. ఏదైనా అంశం కోసం వెతికేటప్పుడు సెర్చ్ ఫలితాల్లో అవసరమైన, అనవసరమైన డాటా మన ముందు ప్రత్యక్షం అవుతుంటుంది. అందులో ఒక్కోసారి మెదడు, మనసును ప్రభావితం చేసే విషయాలు కనిపిస్తుంటాయి. అలా గూగుల్‌లో ఎప్పుడూ వెతకకూడని కొన్నింటి గురించి ఓసారి తెలుసుకుందాం.
1. నిక్కీ కాట్సౌరాస్
2006 అక్టోబరులో నిక్కీ అనే 18 ఏళ్ల అమ్మాయి తన తండ్రితో కారులో వెళ్తుండగా.. భయంకరమైన ప్రమాదానికి గురైంది. ఆమె శరీరం గుర్తించలేనంతగా నుజ్జయింది. కనీసం తన కుటుంబసభ్యులు కూడా నిక్కీ మృతదేహాన్ని చూడలేకపోయారు. దీని గురించి ఎప్పుడూ మీరు గూగుల్‌లో వెతకండి.
2. వ్యాధి లక్షణాల కోసం..
ఆరోగ్యపరమైన సమస్యల గురించి గూగుల్‌లో వెతకడం సురక్షితం కాదు. అలా వ్యాధి గురించి తెలుసుకొని ఔషధాలను వాడటం మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేయ్యొచ్చు. కొన్నిసార్లు తలనొప్పి, ఇన్ఫెక్షన్ వంచి చిన్న గాయాల గురించి వెతికితే.. త్వరలోనే మరణం సంభవిస్తుందని, క్యాన్సర్ వంటి రోగం బారిన పడ్డారని ఫలితాలిస్తుంది. ఇది మిమ్మల్ని మనోవేదనకు గురిచేస్తుంది. ఏదైన ఆరోగ్య సమస్య వస్తే.. దగ్గర్లోని వైద్యుని సంప్రదించి సలహాలు తీసుకోవడం మేలు.
3. క్లాక్ స్పైడర్
దీని గురించి సెర్చ్ చేస్తే పెద్ద పరిమాణంలో ఉన్న సాలెపురుగులను చూపిస్తుంది. ఇది రాత్రివేళ చూస్తే భయం కలిగించొచ్చు! గుంపుల గుంపుల సాలెపురుగులు కొందరికి అసహ్యం కలిగించి అన్నం తినే సమయంలో గుర్తుకురావచ్చు. చివరికి అది మీ ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
4. లాంప్రే వ్యాధి
లాంప్రే వ్యాధి (చేపకు కింది దవడ లేకపోవడం) నిజమైనది కాదు. సాధారణంగా కింది దవడలేని చేపలు ఉండవు. కానీ దీని గురించి మీరు గూగుల్ల్లో సెర్చ్ చేసినట్లయితే రాత్రివేళ పడుకున్నప్పుడు భయంకరమైన కలలు వస్తాయి. తీవ్ర భయానికి గురిచేస్తాయి. ఇలాంటి వాటి కోసం పరిశోధించకపోవడమే మంచిది.
5. జిగ్గర్
జిగ్గర్ అంటే ఓ రకమైన ఓడ. అయితే దీని గురించి వెతికినప్పుడు మొదటగా ఇసుకలో సంచరించే ఓ రకమైన పరాన్నజీవి కనిపిస్తుంది. ఇది కాళ్ల చర్మంలోకి దూరిపోయి అక్కడ గుడ్లు పెడుతుంది. చాలా లోతుగా రంధ్రం కావడం వల్ల చర్మానికి శస్త్ర చికిత్స చేసి తీయాల్సి ఉంటుంది. ఇది చూడటానికి అతి భయంకరంగా ఉండి జుగుప్స కలిగిస్తాయి.
6. కిల్లర్ కిడ్స్
దుర్మార్గమైన అంశాలు, హత్యల కోసం రోజూ వార్తల్లో చూస్తూ ఉంటాం. అయితే రక్తం, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలపై బ్లర్, మార్ఫింగ్ వేసి దాని ప్రభావాన్ని తగ్గిస్తుంటాయి వార్త సంస్థలు. అయితే కొందరు నెటిజన్లు అలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజలను భయపెట్టేందుకు దారుణమైన విషయాలను షేర్ చేస్తుంటారు. గూగుల్‌లో అలానే పోస్ట్ అయిన డానియల్ పేట్రే గురించి మాత్రం సెర్చ్ చేయవద్దు. 16 ఏళ్ల ఓ యువకుడు తన స్నేహితుడి శరీరాన్ని రెండు భాగాలు చేసి అత్యంత దారుణంగా చంపేశాడు. ఇది చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. కిల్లర్ కిడ్స్ పేరుతో వెతికితే ఇలాంటి విషయాలు చాలానే కనిపిస్తాయి. ఇవి మానసికంగా ప్రభావితం చేస్తాయి.
7. బ్రౌన్ రిక్లూస్ స్పైడర్ కాటు