తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​, అమెరికా కాదు... జిన్​పింగ్​కు ఆ కార్టూనే​ శత్రువు! - china latest news

షీ జిన్‌ పింగ్‌.. చైనా అధ్యక్షుడు. బీజింగ్​ 'దురాక్రమణ' సిద్ధాంతాన్ని దూకుడుగా అమలు చేస్తున్న దేశాధినేత. సైనిక సంపత్తి, వాణిజ్యం... ఇలా ప్రతి అంశంలోనూ అగ్రరాజ్యానికే సవాలు విసిరే వ్యక్తి. అలాంటి వ్యక్తికీ ఓ భయం ఉంది. ఏంటది?

xi jinping Winnie the Pooh news
చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​​ బలహీనత ఏంటో తెలుసా?

By

Published : Jun 17, 2020, 4:47 PM IST

చైనా.. ప్రపంచదేశాలను శాసించే స్థాయికి ఎదగాలన్న దుర్భుద్దితో రగిలిపోతోంది. ఇందుకోసం పక్కదేశాలపై దాడులకు తెగబడటం, చిన్న దేశాలకు స్తోమతకు మించి రుణాలు ఇచ్చి ఆస్తులు స్వాధీనం చేసుకోడానికి ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి దేశానికి అధ్యక్షుడు షీ జిన్​ పింగ్​. ప్రస్తుతం భారత్​తో ఘర్షణల వెనుక ప్రధాన వ్యూహకర్త ఈయనే అన్నది నిపుణుల అభిప్రాయం. ఏ దేశాన్ని అయినా ఆర్థికంగా, సామాజికంగా విచ్ఛిన్నం చేయగల శక్తి జిన్​పింగ్​​ సొంతం. అయితే అంతటి శక్తిమంతుడికీ ప్రతి మనిషిలాగే ఓ బలహీనత ఉంది. అదే 'విన్నీ... ద పూహ్​'

జిన్​పింగ్​కు కోపం, చిరాకు తెప్పించే 'విన్నీ' మనిషి కాదు. ఓ కార్టూన్ క్యారెక్టర్​. ఎంతో బలగం, మందీ మార్బలం ఉన్న జిన్​పింగ్​కు ఓ కార్టూన్​ బొమ్మ​ అంటే భయమా? అని మీ సందేహమా! అయితే గతంలోకి వెళ్దాం.

జిన్​పింగ్​ వర్సెస్​ 'విన్నీ ద పూహ్​'

అలా నిషేధం...

అది 2013.. చైనా అధ్యక్షుడైన షీ జిన్​ పింగ్​.. అమెరికాలో పర్యటించారు. ఆయన అగ్రరాజ్యంలోకి రావడం నచ్చక ఎంతోమంది విమర్శలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఆయన పర్యటన వెనుక ఏదో వ్యూహం దాగుందని, జిన్​ను నమ్మొద్దని పెద్ద చర్చే నడిచింది. ఆ సమయంలో మీమ్స్​ చేసేవాళ్లు ఊరుకుంటారా. జిన్​పింగ్​ను 'విన్నీ​'తో పోల్చుతూ పెద్ద రచ్చ చేశారు. ఆనాడు జిన్​ను ఆహ్వానించిన అమెరికా అధ్యక్షుడు బరాక్​ ఒబామానూ ఓ 'కార్టూన్​ టైగర్'​గా చూపించారు.

ఒబామాతో షీ జిన్​పింగ్​

2014.. జపాన్​ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ మధ్య ప్రత్యక్షంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ సమయంలో షింజోను గ్లూమీ డాంకీతో, జిన్​ను 'విన్నీ​'తో పోల్చుతూ మళ్లీ ఫొటోలు వైరలయ్యాయి.

ఆ తర్వాత హాంకాంగ్​ రాజకీయ నాయకురాలు కేరీ లామ్​ను జిన్​పింగ్​ను కలిసినప్పుడూ ఇదే తరహా బొమ్మలు విపరీతంగా ట్రెండ్​ అయ్యాయి.

షింజో అబేతో జిన్​పింగ్​
హాంకాంగ్​ లీడర్​ కేరీ లామ్​తో, షీ జిన్‌ పింగ్‌

2015.. జిన్​పింగ్​ ఓ పరేడ్​లో పాల్గొనగా​ ఆయన చిత్రాలకు 'విన్నీ'ని జోడించి మీమ్స్​ విడుదల చేశారు కొందరు నెటిజన్లు. ఇంకేముంది వాటిని చూసి గరం గరం అయిన జిన్​.. చైనాలో ఆ కార్టూన్​ కనపడకుండా నిషేధించారు. ఆ దేశంలోని సామాజిక మాధ్యమాలు, యాప్​లు, సెర్చ్​ ఇంజిన్​లోనూ దీనికి సంబంధించిన వార్తలు కనిపించకుండా బ్లాక్​ చేశారు. అంతేకాదు అక్కడ బాగా ఫేమస్​ అయిన టిక్​టాక్​లోనూ విన్నీ కనిపించడానికి వీలులేదని హెచ్చరికలు జారీ చేశారు. అలా 'విన్నీ' పదమే ఆ దేశంలో వినిపించకుండా చేశారు.

పరేడ్​లో జిన్​పింగ్​

అన్నీ మరిచిపోయిందేమో అని ప్రపంచం భావిస్తున్న సమయంలో 2018లో డిస్నీ.. క్రిస్టోఫర్​ రాబిన్​ అనే యానిమేషన్​ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అయితే ఇందులోనూ 'విన్నీ' పాత్ర ఉండటం వల్ల తమ దేశంలో సినిమా విడుదలకు అంగీకరించలేదు బీజింగ్.

క్రిస్టోఫర్​ రాబిన్​ సినిమాలో 'విన్నీ ద పూహ్​'

ఇదీ చూడండి: చైనా-భారత్ వివాదం: ఈటీవీ భారత్ కథనాలు

ABOUT THE AUTHOR

...view details