అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban ఆక్రమించుకున్న తర్వాత.. అక్కడి ప్రజలు దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఆహారం దొరకక చాలా మంది పస్తులు ఉంటున్నారు. మరికొంతమంది అనారోగ్యం బారినపడి, వైద్యం చేయించుకునేందుకు సరిపడా డబ్బులు లేక సతమతమవుతున్నారు. ఓ మహిళ.. తన 13 ఏళ్ల కూతురి వైద్యం కోసం తన ఏడాదిన్నర వయసు చిన్నారిని అమ్మేసింది. ఈ మేరకు 'టోలో న్యూస్' ఓ కథనం ప్రచురించింది.
30 వేల కోసం
"బగ్లాన్కు చెందిన లైలుమా భర్త ఏడాది నుంచి కనిపించడం లేదు. బగ్లాన్ను తాలిబన్లు(Afghanistan Taliban ఆక్రమించుకున్న తర్వాత కాబుల్‌కు చేరుకున్న లైలుమా.. అక్కడే శిబిరాల్లో నివసిస్తోంది. అనారోగ్యం బారినపడిన తన 13 ఏళ్ల కుమార్తెకు వైద్యం కోసం.. గత్యంతరం లేని పరిస్థితుల్లో 30వేల కోసం ఓ వ్యక్తికి తన చిన్నారిని అమ్మేసింది"అని 'టోలో న్యూస్' తన వార్తా కథనంలో తెలిపింది.
తీవ్ర ఇబ్బందులు..