భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ వెల్లడించారు. త్వరలోనే తర్వాత దశ సైనికస్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు.
"ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గి, అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి. ఇరు దేశాలకు చెందిన ముందు వరుసలో ఉండే సైనిక బలగాలను గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి ఉపసంహరించడం జరిగింది. మరోసారి కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలకు సిద్ధమవుతున్నాం" అని తెలిపారు.