తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​-చైనా ద్వైపాక్షిక చర్చల్లో 'మసూద్​ అజార్​'

జైషే మహ్మద్ ఉగ్రసంస్థ స్థాపకుడు మసూద్​ అజార్​ అంశంపై మిత్ర దేశం చైనాతో చర్చలు జరిపామని తెలిపారు పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్​​​ ఖురేషీ. మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో నాలుగోసారి చైనా అడ్డుపడిన నేపథ్యంలో ఖురేషీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పాక్​-చైనా ద్వైపాక్షిక చర్చల్లో మసూద్​ అజార్​ అంశం

By

Published : Mar 23, 2019, 6:47 AM IST

Updated : Mar 23, 2019, 7:06 AM IST

పాక్​-చైనా ద్వైపాక్షిక చర్చల్లో మసూద్​ అజార్​ అంశం
మిత్రదేశాలు పాకిస్థాన్​​-చైనా వ్యూహాత్మక భాగస్వామ్య చర్చల్లో భాగంగా మసూద్ అజార్ అంశంపై చర్చించామని పాక్​ విదేశాంగ కార్యదర్శి మహ్మూద్​ ఖురేషీ తెలిపారు. చైనా పర్యటన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు ఖురేషీ.

"మసూద్​ విషయంలో మరింత స్పష్టమైన సమాచారం కోసమే చైనా.. ఐరాస ప్రతిపాదనకు అభ్యంతరం తెలిపింది. దీనిపై అమెరికా, బ్రిటన్​ దేశాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయనే అంశంపై చర్చించాం "

-మహ్మూద్ఖురేషీ, పాక్ విదేశాంగ మంత్రి

1267 అల్​ఖైదా ఆంక్షల కమిటీపై చర్చించామన్నారు ఖురేషీ. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. పుల్వామా ఘటనపై భారత్ పంపిన నివేదికలోని అంశాలను విశ్లేషిస్తున్నామని ఆయన అన్నారు. త్వరలోనే దీనిపై స్పందనను భారత్​తో పాటు ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పారు.

జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలనే ఐరాస భద్రతా మండలిలో వచ్చిన ప్రతిపాదనలను చైనా నాలుగు సార్లు అడ్డుకుంది. డ్రాగన్​.. తనకున్న వీటో అధికారంతోనే మసూద్​ విషయంలో అడ్డుతగులుతోంది. చైనా వైఖరిపై భారత్​ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Last Updated : Mar 23, 2019, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details