తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో జనాభా సంక్షోభం- భారీగా తగ్గిన జననాలు - చైనాలో తగ్గిన బర్త్​ రేట్​

Demographic crisis in China: చైనాను జనాభా సంక్షోభం వెంటాడుతోంది. 2020 జనాభా లెక్కల ప్రకారం సుమారు 10 ప్రావిన్స్​ల్లో జననాల రేటు ఒక్కశాతం కంటే తక్కువగా నమోదు అయ్యింది. జననాల రేటును పెంచేందుకు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చేందుకు చట్టసవరణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగింది.

Demographic crisis in China
చైనా బర్త్​ రేట్​

By

Published : Jan 5, 2022, 8:09 PM IST

Demographic Crisis In China: చైనాలో జనాభా సంక్షోభం మరింత ముదురుతోంది. 2020లో ఆ దేశంలోని 10 ప్రావిన్స్​ల్లో జననాల రేటు ఒక శాతం కంటే తక్కువగా నమోదు అయ్యింది. దేశంలో జననాల రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో ముగ్గురు పిల్లల విధానాన్ని ప్రకటించినా.. అవేవీ ఫలితాలివ్వలేదని తాజా గణాంకాలతో స్పష్టమవుతోంది. దీంతో ప్రభుత్వం మరింత అయోమయంలో పడింది.

దేశంలో జననాల రేటు భారీగా తగ్గిన నేపథ్యంలో జనాభా, కుటుంబ నియంత్రణ చట్టానికి సవరణ చేసి చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులపై భారం పడకుండా వారికి మద్దతుగా నిలిచేలా చట్టానికి మార్పులు చేసింది. 2016లో దంపతులు ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనిచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలోనే 'ఒకే శిశువు' విధానాన్ని రద్దు చేసింది. దీంతో పదేళ్లకు ఓసారి జరిగే జనాభా గణనలో చైనా జనాభా 140 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలోనే ముగ్గురు పిల్లలకు అనుమతించేలా చట్టాన్ని సవరించింది. చైనా గతేడాది వెలువరించిన జనగణన నివేదిక ప్రకారం దేశంలో వృద్ధుల సంఖ్య 26.4 కోట్లు (18.7 శాతం) పెరిగింది.

ముగ్గురు పిల్లల విధానాన్ని ఆమోదించిన తర్వాత చైనాలోని 20 కంటే ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. దంపతులకు ప్రసూతి, వివాహ, పితృత్వ సెలవులను పెంచింది. అయితే 2020 గణాంకాల ప్రకారం దేశంలోని 10 ప్రాంతాల్లో ఒక శాతం కంటే తక్కువగా నమోదు కావడం ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. చైనాలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్సులలో ఒకటైన హెనాన్​లో 1978 తర్వాత మొదటిసారిగా జననాలు సంఖ్య 10 లక్షల కంటే తక్కువకు పడిపోయాయి.

చైనా వార్షిక గణాంకాల ప్రకారం 2020లో జనన రేటు ప్రతి వెయ్యి మందికి 8.52గా నమోదైంది. ఇది 43 ఏళ్లలో అత్యల్పం అని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. జనాభా పెరుగుదల రేటు ప్రతి 1,000 మందికి 1.45గా ఉంది. ఇలా నమోదు కావడం 1978 నుంచి ఇదే తొలిసారి అని పేర్కొంది.

ఇదీ చూడండి:ఒక్క నెలలోనే 45లక్షల మంది రాజీనామా!

ABOUT THE AUTHOR

...view details