కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకింత ఉద్ధృతిని చూపిస్తోందో వివరించే కొత్త అధ్యయనం వెలుగు చూసింది. డెల్టా వైరస్ కేవలం వేగంగా వ్యాప్తి చెందడమే కాదు, మనిషి శరీరంలో చాలా త్వరగా వృద్ధి చెందుతోందని ఇది తెలియజేస్తోంది. మొదట 2019-20లో సోకిన కొవిడ్ వైరస్ కంటే ఇది దాదాపు 225 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ అధ్యయనం చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ చాలా దేశాలను హడలెత్తిస్తోంది.
చైనాలోని 'గ్వాంగ్‌జాంగ్ ప్రొవిన్షియల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రిపెవన్షన్' సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం డెల్టా వేరియంట్ శ్వాసవ్యవస్థలో చాలా వేగంగా వృద్ధి చెందుతోందని తేలింది. అంతేకాదు, రోగుల్లో చాలా ఎక్కువగా వైరల్ లోడ్ కూడా కనిపిస్తోంది. మొదట్లో 2020లో వచ్చిన కొవిడ్ వైరస్ కంటే 1000 రెట్లు ఎక్కువగా మనిషి శరీరంలో ఇప్పుడు వైరల్ లోడ్ కనిపిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్ సోకినవారిలో చాలా తొందరగా రోగ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ మొదటి దశలో రోగ లక్షణాలు కనిపించాలంటే ఆరు రోజులు పట్టేదని, ఇప్పుడు కేవలం నాలుగైదు రోజుల్లోనే వైరల్ లోడ్ తీవ్ర స్థాయికి చేరుతోందని పరిశోధకులు కనుగొన్నారు.
అధ్యయనం ఎలా జరిగింది?