తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2021, 8:59 AM IST

ETV Bharat / international

Delta Variant: ''డెల్టా'తో వైరల్ లోడు 300 రెట్లు అధికం'

కరోనా డెల్టా వేరియంట్(Delta Variant)​​ సోకిన వారిలో వ్యాధి లక్షణాలు మొదట బయటపడినప్పుడే వైరల్ లోడు 300 రెట్లు అధికంగా ఉంటుందని ఓ పరిశోధనలో తెేలింది. అయితే నాలుగు రోజుల తర్వాత వైరల్‌ లోడు(Viral Load) 30 రెట్లకు, 9 రోజుల తర్వాత 10 రెట్లకు తగ్గుతుందని పరిశోధకులు చెప్పారు.

delta variant
డెల్డా వేరియంట్​

కరోనా వైరస్‌లో అధిక సాంక్రమిక శక్తి కలిగిన డెల్టా వేరియంట్‌(Delta Variant)​ సోకిన వారిలో.. వ్యాధి లక్షణాలు మొదట బయటపడినప్పుడే వైరల్‌ లోడు(Viral Load) చాలా ఎక్కువగా ఉంటోందని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తేల్చారు. వైరస్‌కు సంబంధించిన మొదటి రకంతో పోలిస్తే 300 రెట్లు అధికంగా ఉంటోందని చెప్పారు. అయితే నాలుగు రోజుల తర్వాత వైరల్‌ లోడు 30 రెట్లకు, 9 రోజుల తర్వాత 10 రెట్లకు తగ్గుతుందన్నారు.

కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ(కేడీసీఏ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఒక వ్యక్తిలో వైరల్‌ లోడు అధికంగా ఉండటం వల్ల అతడి నుంచి వైరస్‌ వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. "అయితే ఈ పరిశోధన బట్టి డెల్టా రకం(Delta Variant)​ 300 రెట్లు ఎక్కువ సాంక్రమిక శక్తిని కలిగి ఉందని భావించరాదు. దీని సాంక్రమిక శక్తి ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే 1.6 రెట్లు, మొదట వెలుగు చూసిన కరోనా రకంతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంది" అని కేడీసీఏ ఉన్నతాధికారి లీ సాంగ్‌-వన్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details