ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వినియోగంలో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయంపై చైనా స్పందించింది. తమ దేశంలోని రెండు కంపెనీలు సరఫరా చేసిన కొవిడ్-19 కిట్లపై నిషేధం విధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన చైనా.. భారత్ సహేతుకంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే.. చైనా సరఫరా చేసిన కిట్ల ద్వారా తప్పుడు ఫలితాలు వస్తుండటం వల్ల వాటిని వినియోగించరాదని ఐసీఎంఆర్ నిర్ణయించింది.
ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది చైనా. తాము ఎగుమతి చేసిన వైద్య పరికరాలు ఎంతో నాణ్యతతో కూడుకున్నవని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్ చెప్పారు.
'చైనా ఉత్పత్తులు ఎంతో నాణ్యతతో కూడుకున్నవి. వీటిపై తప్పుడు ప్రచారాలు చేయడం బాధ్యరాహిత్యం. అయినప్పటికీ వైరస్ పై పోరాటానికి భారత్ కు మేం సహకరిస్తాం. త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తాం.'
- జీ రోంగ్, భారత్లో చైనా రాయబార కార్యలయ ప్రతినిధి