అఫ్గాన్ రాజధాని కాబుల్‌లోని ఓ పాఠశాలపై జరిగిన బాంబు దాడి ఘటనలో మృతుల సంఖ్య 50కి చేరింది. మరణించిన వారిలో ఎక్కువ మంది 11-15 ఏళ్ల వయసు విద్యార్థులే ఉన్నారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ ఘటనలో మరో 100 మందికిపైగా గాయపడినట్టు తెలిపింది.
ఏం జరిగిందంటే?
కాబుల్ పశ్చిమ ప్రాంతంలోని షియా పరిసరాల్లో.. రోజూలాగే విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రవేశ ద్వారానికి వెలుపల మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో శనివారం 30 మంది దుర్మరణం పాలవ్వగా.. అనేక మంది గాయపడ్డారు.