తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాక్​: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో 18 మంది మృతి - ఇరాక్​ ఆందోళనల్లో 18 మంది మృతి

ఇరాక్​లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఫలితంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా గాయపడ్డారు. అవినీతి, నిరుద్యోగ సమస్యతో విసుగుచెందిన ప్రజలు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. నాయకుడే లేని ఈ ఆందోళనలు దక్షిణ ఇరాక్​ అంతా వ్యాపించాయి. పరిస్థితులు ప్రధాని అదెల్​ అబ్దెల్​ మహదీకి​ ఇబ్బందికరంగా పరిణమించాయి.

ఇరాక్​: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో 18 మంది మృతి

By

Published : Oct 3, 2019, 6:37 PM IST

Updated : Oct 3, 2019, 7:37 PM IST

ఇరాక్​: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో 18 మంది మృతి

ఇరాక్​లో మూడు రోజులుగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు మరణించిన నిరసనకారుల సంఖ్య 18కి చేరింది. ఓ పోలీసు అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

రాజధాని బాగ్దాద్​లో ఆందోళనలు నిర్వహించరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే నిరసనకారులు ప్రభుత్వ హెచ్చరికల్ని బేఖాతరు చేశారు. ఫలితంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

తెహ్రీర్​ స్క్వేర్​ సహా పలు ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. బాగ్దాద్​ నుంచి తెహ్రీర్ చేరుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.

అవినీతి, నిరుద్యోగ సమస్యతో విసుగుచెందిన ప్రజలు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. నాయకుడే లేని ఈ ఆందోళనలు దక్షిణ ఇరాక్​ అంతా వ్యాపించాయి. పరిస్థితులు ప్రధాని అదెల్​ అబ్దేల్​ మహదీకి​ పెద్ద తలనొప్పిగా మారాయి.

ఇదీ చూడండి:ఆ నగరంలో ట్రాఫిక్​ జామ్​ అయితే ఆనందమే!

Last Updated : Oct 3, 2019, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details