ఉత్తర చైనా- షాంక్సీ రాష్ట్రం జియాంగ్ఫెన్ కౌంటీలో రెస్టారెంట్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
రెస్టారెంట్ భవనం కూలిన ఘటనలో 29 మంది బలి - Juxian Restaurant in Chenzhuang Village
చైనాలోని షాంక్సీ రాష్ట్రంలో శనివారం.. రెస్టారెంట్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
రెస్టారెంట్ భవనం కూలిన ఘటనలో 29కి చేరిన మృతులు
రెస్టారెంట్లో ఓ 80 ఏళ్ల వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా.. అక్కడ జరిగే విందుకు బంధుమిత్రులు, గ్రామస్థులు హాజరయ్యారు. అదే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. 57 మందిని వెలికితీశారు. ఇందులో ఏడుగురు తీవ్రంగా గాయపడగా మరో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇదీ చదవండి:జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!