ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించిన ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి మరో 73 మంది మృతి చెందారు. తాజా మృతులతో ఈ ప్రాణాంతక మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 636కు చేరింది. ఇప్పటివరకు 31, 161 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే 1540 మంది వ్యాధి తీవ్రత తగ్గిన వారిని డిశ్ఛార్జీ చేశారు.
జపాన్ ఓడలో మరో 41 మందికి..
జపాన్‌కు సమీపంలో నిలిపేసిన ఓడలోని 41 మందికి కరోనా సోకినట్లు సమాచారం.