తెలంగాణ

telangana

ETV Bharat / international

వణికిస్తోన్న కరోనా.. 17కు చేరిన మృతులు - Latest news for China's coronavirus

చైనాలో కరోనా వైరస్​.. మృతుల సంఖ్య 17కు చేరుకుంది. 543మంది ఈ వైరస్​ బారిన పడినట్లు అధికారులు పేర్కొన్నారు. విదేశాలకు ప్రయాణించవద్దని వుహాన్​ వాసులకు చైనా సూచనలు చేసింది. అమెరికా, హాంగ్​కాంగ్​, మెక్సికో దేశాలలో న్యుమోనియా వ్యాధి లక్షణాలతో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రపంచ దేశాలలో గుబులు పుట్టిస్తోంది.

Death toll in China's coronavirus outbreak sharply rises to 17
17కు చేరిన కరోనా వైరస్​ బాధితుల సంఖ్య!

By

Published : Jan 22, 2020, 11:49 PM IST

Updated : Feb 18, 2020, 1:51 AM IST

ప్రపంచ దేశాలను చైనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా వైరస్​ ఇప్పటికే 17మందిని బలితీసుకుంది. బుధవారం ​నాటికి వైరస్​ సంబంధిత లక్షణాలతో 543 కేసులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. అమెరికా, హాంగ్​కాంగ్​, మెక్సికో దేశాల్లో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

వుహాన్​ నగరం ఈ వైరస్​కు కేంద్ర బిందువుగా మారింది. చైనాలో నూతన సంవత్సర వేడుకలు, సెలవుల నేపథ్యంలో చైనాను విడిచివెళ్లవద్దని నగరవాసులకు సూచనలు చేసింది ప్రభుత్వం.ప్రాణాంతక వైరస్​తో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అత్యవసర సమావేశం జరిపింది. ఈ వైరస్​ను ప్రపంచవ్యాప్త ఆరోగ్య అత్యయిక పరిస్థితిగా ప్రకటించే అంశంపై చర్చలు జరిపింది.

ఇదీ చూడండి:వణికిస్తున్న రాకాసి వైరస్- దిల్లీ ఎయిర్​పోర్ట్​లోనూ పరీక్షలు

Last Updated : Feb 18, 2020, 1:51 AM IST

ABOUT THE AUTHOR

...view details