ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19(కరోనా) ధాటికి చైనాలో మరో 143మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా 1523మంది మృతి చెందారు. 2641మందికి కొత్తగా వైరస్ సోకినట్లు సమాచారం. మొత్తంగా 66వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
కరోనా కాటుకు మరో 143మంది బలి - china hubei province
కొవిడ్-19 (కరోనా) కారణంగా చైనాలో మరో 143మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో మృతుల సంఖ్య 1523కి చేరింది. 2641 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు సమాచారం.
కరోనా కాటుకు మరో 139మంది బలి
హుబీ ప్రావిన్స్ మినహా దేశవ్యాప్తంగా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు చైనా అధికారులు ప్రకటించారు. అదే సమయంలో కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికత వంటి పరిజ్ఞానాలను వినియోగించి వ్యాధి లక్షణాల గుర్తింపు, నియంత్రణ చేపట్టాలని చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి:కోడి మాంసంతో కరోనా రాదు
Last Updated : Mar 1, 2020, 9:31 AM IST