చైనాలో ప్రబలి.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరింది. ఈ మేరకు కరోనా వైరస్ కేసుల వివరాలను చైనా జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. హూబీ రాష్ట్రంలో 24 మంది, ఉత్తర చైనా హుబీలో ఒకరు ఈ వైరస్ వల్ల మృతి చెందినట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 830 మంది ప్రజలు వైరస్ భారిన పడినట్లు గుర్తించామని వైద్యాధికారులు తెలిపారు.
కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా భావిస్తోన్న చైనాలోని వుహాన్ నగరం సహా హుబీ రాష్ట్రంలోని మరో ఐదు నగరాల్లో ప్రజల రాకపోకలను అధికారులు నిషేధించారు. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లోని ప్రయాణికులకు విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా... ఉత్తర కొరియా- చైనా దేశానికి మధ్య రాకపోకలను నిషేధించారు.
భారతీయుల కోసం హెల్ప్‌లైన్..