జపాన్లో భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు వరదల్లో చిక్కుకొని మరణించిన వారి సంఖ్య 50కు చేరిందని... కొంతమంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
వరద బీభత్సం.. 50కు చేరిన మృతులు - Japan floods updates
జపాన్ వరదల్లో మృతుల సంఖ్య 50కు చేరింది. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
50కు చేరిన జపాన్ వరదల మృతుల సంఖ్య
దక్షిణ జపాన్లోని క్యూషు, కుమామోటోలో.. ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం వల్ల పట్టణాలు, నగరాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. డ్రైనేజీ కాలువల్లో చెత్త పేరుకుపోయి మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. విపత్తు నిర్వహణ సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి:భారత్లో 20వేలు దాటిన కరోనా మరణాలు