తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాకు హెచ్చరికగా చైనా క్షిపణి పరీక్ష! - చైనా రక్షణ శాఖ

శత్రు దేశాల క్షిపణి వ్యవస్థను నిర్వీర్యం చేసే యాంటీ బాలిస్టిక్​ మిసైల్​ సామర్థ్యాన్ని గురువారం విజయవంతంగా పరీక్షించింది చైనా. రష్యాతో కీలక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని పొడిగించేందుకు అమెరికా ఆమోదించిన మరుసటి రోజునే క్షిపణి పరీక్షలు చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది.

China conducts anti-ballistic missile test
చైనా యాంటీ బాలిస్టిక్​ మిసైల్​ పరీక్ష

By

Published : Feb 6, 2021, 12:03 PM IST

Updated : Feb 6, 2021, 12:40 PM IST

శత్రు దేశాల నుంచి క్షిపణి ముప్పును ఎదుర్కొనే యాంటీ బాలిస్టిక్​ మిసైల్​ సామర్థ్యాన్ని చైనా గురువారం పరీక్షించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా తర్వాత ఇంతటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన రెండో దేశంగా నిలిచింది చైనా.

రష్యాతో కీలక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని పొడిగించేందుకు బైడెన్​ సర్కార్​ ఆమోదం తెలిపిన మరుసటి రోజే చైనా ఈ ప్రయోగం చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఈ పరీక్ష ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోలేదని చైనా రక్షణ శాఖ స్పష్టం చేసింది.

మరోవైపు.. ఈ పరీక్ష అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్​కు ఓ సందేశం అని మకావు సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆంటోని వాంగ్​ టోంగ్​ అన్నారు. ఇంటర్మీడియట్​-రేంజ్​ న్యూక్లియర్​ ఫోర్సెస్​ ట్రిటీ(ఐఎన్​ఎఫ్​) నిష్క్రమణ అనంతరం.. అమెరికా ఈ తరహా బాలిస్టిక్​ క్షిపణులను మరింత వేగంగా అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు.

ఇటీవలి కాలంలో చైనాను వ్యూహాత్మక పోటీదారుగా పరిగణించింది అగ్రరాజ్యం. అణు సామర్థ్యాలను పారదర్శకత లేకుండా వేగంగా అభివృద్ధి చేసిందని చైనాపై మండిపడింది.

ఇదీ చదవండి:ట్రంప్​కు ఆ విషయాలు చెప్పబోం: బైడెన్​

Last Updated : Feb 6, 2021, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details