నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి ఊరట లభించింది. అభిప్రాయబేధాలతో కొద్ది రోజులుగా ఓలీ ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తోన్న అధికార కమ్యూనిస్ట్ పార్టీ కో-ఛైర్మన్ ప్రచండ వెనక్కి తగ్గారు.
తన డిమాండ్‌ను ఉపసంహరించుకున్నారని... ప్రచండ, ఓలి మధ్య ఒప్పందం కుదిరేందుకు అడ్డంకులు తొలిగిపోయాయని పేర్కొంది కాఠ్మాండూ పోస్ట్.
కొద్ది రోజుల క్రితం భారత్‌లోని మూడు భూభాగాలను తమవేనని పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను పార్లమెంట్లో ఆమోదించుకున్నారు ఓలి. తనను పదవి నుంచి దింపేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి సొంత పార్టీలో ఓలిపై వ్యతిరేకత మొదలైంది. పార్టీలోని సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీ నియమాలకు విరుద్ధంగా ఓలి రెండు పదవులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తోటి సభ్యులు. ప్రధాని పదవి, లేదంటే పార్టీ ఛైర్మన్ పదవిని వదులుకోవాలని పట్టుబడుతున్నారు. అయితే.. ఇందుకు ఓలి నిరాకరిస్తున్నారు.