covid cases in China: కరోనా పుట్టినిల్లు చైనాలో కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. రాజీలేని విధానం ద్వారా దేశంలో కొవిడ్ కేసులను సున్నాకు తేవాలనే చైనా యత్నాన్ని కరోనా వమ్ము చేస్తోంది. చైనాలో ఆదివారం 312 కరోనా కేసులు నమోదుకాగా.. సోమవారం మరో 214 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. 2020 మార్చి తర్వాత చైనాలో నమోదైన అత్యధిక రోజువారీ కరోనా కేసులు ఇవే కావడం గమనార్హం. దేశ రాజధాని బీజింగ్‌లో మాత్రం కొత్త కేసులేమీ వెలుగు చూడలేదు.
చైనాలో కరోనా కలకలం.. రెండేళ్లనాటి గరిష్ఠానికి రోజువారీ కేసులు! - కొవిడ్ కేసులు చైనా
covid cases in China: చైనాలో మరోమారు కొవిడ్ విజృంభిస్తోంది. 2020 మార్చి తర్వాత రోజువారీ అత్యధిక కేసులు గత రెండు రోజులుగా నమోదవుతున్నాయి. చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతం హాంకాంగ్‌లో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి.
చైనాలో కొవిడ్ కేసులు
చైనాలో ఇప్పటికే 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 2019 నుంచి ఇప్పటివరకు చైనాలో 1,11,195 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఐతే చైనాకు చెందిన ప్రత్యేక పరిపాలనా ప్రాంతం హాంకాంగ్‌లో మాత్రం కరోనా విజృంభిస్తోంది. అక్కడ రోజువారీ కేసులే 50 వేలకుపైగా నమోదవుతున్నాయి.
ఇదీ చదవండి:Covid Cases in India: దేశంలో 5వేల దిగువకు కరోనా కేసులు