కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో వైరస్ ఏఏ వస్తువుల మీద ఎన్ని రోజులు జీవించి ఉండగలదో అన్న దానిపై అధ్యయనం చేశారు హాంకాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. మాస్క్‌లపై ఒక వారం, బ్యాంకు నోట్లు, స్టెయిన్‌లెస్ స్టీల్, ప్లాస్టిక్ ఉపరితలంపై 4 నుంచి 7 రోజులు పాటు వైరస్ సజీవంగా ఉంటుందని వెల్లడించారు. సబ్బుతో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవటం ద్వారా వైరస్ నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
మాస్క్‌ల ఉపరితలంపై వారం రోజుల పాటు ఉంటుందన్న పరిశోధకులు.. ధరించిన మాస్క్‌లను ముట్టుకోకుండా ఉంటే మంచిదని పరిశోధకుడు పీరిస్ తెలిపారు. ఆ తర్వాత చేతులతో కళ్లను తాకటం ద్వారా వైరస్ కంటి నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అన్ని ఉపరితలాలపై వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడం గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు.