కరోనా సోకిన వ్యక్తిలో ప్రాథమిక లక్షణాలు కనిపించడానికి 2, 3 రోజుల ముందు నుంచే వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందుతుందని ఓ అధ్యయనం తేల్చింది. వైరస్ సోకిన తర్వాత 7 రోజుల ఇంక్యుబేషన్ కాలం ఉంటుందని, ఆ తర్వాత ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయని గుర్తించారు హాంకాంగ్ పరిశోధకులు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని నేచర్ మెడిసిన్ పత్రికలో ప్రచురించారు.
ఈ అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ సంక్రమణ, వ్యాధి వ్యాప్తి చెందే మధ్య కాలం అత్యంత కీలకమని చెప్పారు హాంకాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వైరస్ తొలి దశ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందిస్తే మహమ్మారిని కట్టడి చేయవచ్చని నివేదించారు.
414 నమూనాలపై అధ్యయనం