తెలంగాణ

telangana

ETV Bharat / international

'సందేహమే లేదు కరోనాపై పసికందులదే విజయం' - నవజాత శిశువలకు కరోనా

తనకేమైనా భరించే తల్లి.. బిడ్డ విషయంలో మాత్రం ఉపేక్షించదు. అలాంటిది ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కారణంగా తల్లి నుంచే బిడ్డకు ముప్పు వాటిల్లితే? ఎంతో మంది గర్భిణులు తీవ్ర ఆందోళన చెందుతున్న ఈ విషయంలో ఓ శుభవార్త చెప్పారు చైనాలోని వైద్య పరిశోధకులు. అదేంటో తెలుసుకుందాం..

Covid-19 not transmitted from pregnant mothers to offsprings: study
'సందేహమే లేదు.. కరోనాపై పసికందులదే విజయం'

By

Published : Mar 16, 2020, 4:16 PM IST

ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న కరోనాపై ఓ శుభవార్త చెప్పారు చైనా పరిశోధకులు. నిర్దిష్ట వాహకం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తున్న ఈ మహమ్మారి.. ఒకవేళ తల్లికి సోకినప్పటికీ.. గర్భంలోని శిశువుకు మాత్రం వ్యాపించదని స్పష్టం చేశారు. వుహాన్​లో కరోనా సోకిన నలుగురు గర్భిణులపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని మరోమారు ధ్రువీకరించారు. కొవిడ్​-19తో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది వైరస్​ బారిన పడిన నేపథ్యంలో వైద్య పరిశోధకుల వార్తతో గర్భిణులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

పరిశోధనలు జరిపిన నలుగురు పసికందుల్లో ముగ్గురికి కరోనా నెగటివ్​గా వచ్చిందని.. ఓ తల్లి మాత్రం తన బిడ్డకు పరీక్షలు జరిపేందుకు నిరాకరించిందని ప్రధాన పరిశోధకులు డాక్టర్​ యలన్​ లియూ తెలిపారు. ప్రస్తుతం నలుగురు శిశువులతో పాటు వారి తల్లులు కూడా కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించారు.

" నవజాత శిశువుల్లో కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలేమీ లేవు. అయితే ఒక శిశువు శరీరంపై మాత్రం దద్దుర్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా అవే తగ్గిపోయి. ఈ దద్దుర్లు కరోనా వల్ల వచ్చాయా? లేదా ఇంకేమైనా ఆరోగ్య సమస్యలతో వచ్చయా? అన్న విషయం తెలియాల్సి ఉంది."

- డాక్టర్​ యలన్​ లియూ, ప్రధాన పరిశోధకులు

కరోనా ఇప్పటివరకు 114 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 1,32,758 మందికి వైరస్​ సోకినట్లు గుర్తించారు. ఒక్క చైనాలోనే 3,400 మందికి పైగా మృతి చెందారు. ఇటలీ, ఇరాన్​లోనూ వేలాదిమంది మృత్యువాత పడ్డారు.

ఇది చదవండి:కరోనా దెబ్బకు అమెరికా 14 రోజులు బంద్!

ABOUT THE AUTHOR

...view details