తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: 2 కోట్ల 68 లక్షలు దాటిన కేసులు - #covid-19

ప్రపంచదేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసులు సంఖ్య 2 కోట్ల 68 లక్షలు దాటింది. కొవిడ్​ మరణాల సంఖ్య 8 లక్షలు 78 వేలకు చేరువలో ఉంది. అమెరికా, బ్రెజిల్​, భారత్​లో వైరస్​ విలయం సృష్టిస్తోంది.

COVID-19 new cases and deaths in the world countries
పెరుగుతున్న కరోనా కేసులు- ఇరాన్​లో తెరుచుకున్న పాఠశాలలు​!

By

Published : Sep 5, 2020, 7:49 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రపంచదేశాల్లో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 68 లక్షల 41 వేలు దాటింది. మరో 8 లక్షల 79 వేల 866 మంది మృత్యువాత పడ్డారు. అయితే కోటీ 89 లక్షల 64 వేల మందికిపైగా కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

అమెరికా, బ్రెజిల్​, భారత్​ దేశాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. రష్యాలో కొవిడ్ కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. మెక్సికో, పెరూ, అర్జెంటీనా, కొలంబియా దేశాల్లోనూ కరోనా బాధితులు భారీగానే పెరుగుతున్నారు.

ఇరాన్​లో తెరిచిన పాఠశాలలు...

ఇరాన్​లో కొవిడ్​ ఆందోళనల నడుమ నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు. దాదాపు ఏడు నెలలుగా మూసివేసిన పాఠశాలలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరిగి ప్రారంభించారు ఆ దేశ అధ్యక్షుడు హసన్​ రౌహాని.

  • నేపాల్​లో వైరస్​ కేసుల సంఖ్య 45 వేలు దాటింది. తాజాగా 1041 కేసులు బయటపడగా... మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • చెక్​ రిపబ్లిక్​ దేశంలో తొలిసారిగా రికార్డు స్థాయిలో 700 కేసులు నమోదయ్యాయి.
  • పాకిస్థాన్​లో కొత్తగా 513 మందికి కరోనా సోకింది. మరో ఐదుగురు మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 98 వేలు దాటింది.
దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు కోలుకున్నవారు
అమెరికా 63,90,240 1,92,146 36,36,284
బ్రెజిల్​ 40,91,801 1,25,584 32,78,243
భారత్​ 40,34,339 69,749 31,12,669
రష్యా 10,20,310 17,759 8,38,126
పెరూ 6,76,848 29,554 4,98,523
కొలంబియా 6,50,062 20,888 4,98,221
దక్షిణాఫ్రికా 6,35,078 14,678 5,57,818
మెక్సికో 6,23,090 66,851 4,34,667
స్పెయిన్​ 5,17,133 29,418 N/A
అర్జెంటీనా 4,61,882 9,685 3,40,381

ఇదీ చూడండి:ఒక్క అంగుళం కూడా వదులుకోం: చైనా

ABOUT THE AUTHOR

...view details