థాయిలాండ్‌లో రెండు జైళ్లలోని దాదాపు 3,000 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఈ మేరకు థాయ్ ప్రభుత్వం వెల్లడించింది.
రెండు జైళ్లలో 3,000 మంది ఖైదీలకు కరోనా - థాయ్‌లాండ్‌లో 3000మంది ఖైదీలకు కరోనా
థాయిలాండ్‌లో దాదాపు 3,000 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. వీరిలో మహిళా ఖైదీలు 1,000 మందికిపైగా ఉన్నారు.
ఖైదీలు
బ్యాంకాక్‌లోని ప్రత్యేక జైలులో 3,274 మంది పురుష ఖైదీలలో 1,785మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. మహిళా జైలులో 4,475మంది ఖైదీలకు పరీక్షలు చేయగా 1,040 మంది కరోనా బారిన పడ్డారని పేర్కొంది.
ఇదీ చదవండి:గాజాపై ఇజ్రాయెల్ మరో వైమానిక దాడి