ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 65 లక్షలకు పెరిగింది. ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా 2,88,408 కేసులు నమోదయ్యాయి. మరో 5,896 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 8.74 లక్షలకు చేరుకున్నాయి.
ప్రపంచంపై కరోనా పంజా- ఒక్కరోజే 2.88 లక్షల కేసులు - కరోనా అప్డేట్స్
కరోనా ఉద్ధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 65 లక్షలు దాటింది. ఒక్కరోజులో 2.88 లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాలు 8.74 లక్షలకు చేరుకున్నాయి.
కరోనా ప్రళయం
ప్రస్తుతం 69 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా... కోలుకున్నవారి సంఖ్య కోటి 87 లక్షలు దాటింది.
- సింగపూర్‌లో కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 56,948కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 27కు పెరిగింది.
- పాకిస్థాన్‌లో కొత్తంగా 498 మందికి కరోనా నిర్ధరణయింది. మరో ఏడుగురు వైరస్‌కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 2,97,512కు చేరింది.
- న్యూజిలాండ్‌లో మే 24 తర్వాత ఈ రోజు కేవలం ఒకే ఒక్క కరోనా మరణం సంభవించింది. న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు మొత్తం 1,700 కేసులు నమోదు కాగా 23 మంది చనిపోయారు.
వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 6,336,000 | 191,114 |
బ్రెజిల్ | 4,046,150 | 124,729 |
రష్యా | 1,015,105 | 17,649 |
పెరూ | 670,145 | 29,405 |
కొలంబియా | 641,574 | 20,618 |
దక్షిణాఫ్రికా | 633,015 | 14,563 |
మెక్సికో | 616,894 | 66,329 |