కరోనా నుంచి కోలుకున్నవారి శరీర స్వభావాన్ని బట్టి కొన్ని రోజుల నుంచి సంవత్సరాల వరకు యాంటీబాడీలు ఉంటాయని.. ఓ పరిశోధనలో తేలింది. కొందరిలో కొన్నిరోజులపాటు యాంటీబాడీలు ఉంటే మరి కొందరిలో కొన్ని దశాబ్దాల పాటు క్రియాశీలకంగా ఉంటాయని "ది లాన్సెట్ మైక్రోబ్ జర్నల్ కథనం" పేర్కొంది.
కోలుకున్నవారిలో కొన్నేళ్ల వరకు యాంటీబాడీలు!
కొవిడ్ నుంచి కోలుకున్నవారి శరీర స్వభావాన్ని బట్టి కొన్ని రోజుల నుంచి సంవత్సరాల వరకు యాంటీబాడీలు ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. కొందరిలో యాంటీబాడీల ప్రభావం త్వరగా తగ్గిపోతోందని.. మరికొందరిలో ఆరు నెలలైనా ప్రభావవంతంగానే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
సింగపూర్‌కు చెందిన ఓ మెడికల్ స్కూల్ పరిశోధకులు.. దాదాపు 9 నెలల పాటు 164 మంది కొవిడ్ వ్యాధిగ్రస్థులపై అధ్యయనం చేశారు. శరీరంలో కరోనా యాంటీబాడీలు క్రియాశీలకంగా ఉన్న కాలాన్ని బట్టి వారిని ఐదు గ్రూపులుగా విభజించారు. కొందరిలో యాంటీబాడీల ప్రభావం త్వరగా తగ్గిపోతోందని.. మరికొందరిలో ఆరు నెలలైనా ప్రభావవంతంగానే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. టీ-కణాలు ఎక్కువగా కలిగి ఉన్నవారిలో యాంటీబాడీలు సమర్థంగా పని చేస్తున్నాయని తెలిపారు. దీన్ని నిర్ధరించడానికి మరింత అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
ఇదీ చూడండి:18 రాష్ట్రాలకు పాకిన 'కొత్త రకం' కరోనా