తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎస్​సీఓ దేశాల మద్దతుతో ఉగ్రవాదంపై పోరు: మోదీ

ఉగ్రవాదంపై పోరుకు ఎస్​సీఓ సభ్య దేశాల మద్దతు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. బిష్కెక్​ సదస్సులో పాల్గొన్న మోదీ.. సభను ఉద్దేశించి హిందీలో ప్రసంగించారు. ఉగ్రవాదానికి మద్దతు ప్రకటించే దేశాలపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

By

Published : Jun 14, 2019, 1:07 PM IST

Updated : Jun 14, 2019, 1:32 PM IST

కిర్గిస్థాన్​ రాజధాని బిష్కెక్​లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ హిందీలో ప్రసంగించారు. ఎస్​సీఓలో శాశ్వత సభ్య దేశంగా చేరి రెండేళ్లు పూర్తయిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎస్​సీఓ నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో కీలకంగా పని చేశామని పేర్కొన్నారు.

వివిధ రంగాల్లో సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై సభ్యదేశాలకు కీలకమైన సూచనలు చేశారు మోదీ. ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"ఉగ్రవాద రహిత సమాజం... గత ఆదివారం శ్రీలంక పర్యటనలో భాగంగా సెయింట్​ ఆంటోనీ చర్చిని సందర్శించాను. అక్కడ ఎలాగైతే ఉగ్రవాదులు దాడులు చేశారో.. ప్రపంచంలో ఎక్కడో ఆ చోట రోజూ ఇదే మారణకాండ సాగుతోంది. ఈ ప్రమాదం నుంచి బయట పడేందుకు దేశాలన్ని విభేదాలు పక్కన పెట్టి సమష్టి కృషి చేయాలి. ఉగ్రవాదులకు మద్దతు, ప్రోత్సాహం, ధనబలం కల్పించే దేశాలపై చర్యలు తీసుకోవాలి. ఎస్​సీఓ దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాలి. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ఒక అంతర్జాతీయ వేదిక ఏర్పాటు చేయాలని భారత్​ కోరుతోంది."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: ఎస్​సీఓ సభ్య దేశాధినేతల సమావేశం

Last Updated : Jun 14, 2019, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details